బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రజకులకు న్యాయం: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి

by Shiva |
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రజకులకు న్యాయం: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి
X

దిశ, ములుగు: రజకులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉందని, వారికి ప్రత్యేక నిధులతో శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆదివారం మర్కుక్ మండలంలోని పాములపర్తిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల నుంచి రూ.20 లక్షలతో రజక సంఘ భవనానికి ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రంతో కలిసి వారు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రజక సంఘాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది సీఎం కేసీఆరేనని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని కులాలలకు ప్రత్యేక ప్యాకేజీలతో భవన నిర్మాణాలతో ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా నిలుస్తోందన్నారు. ప్రజల సంఘాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను అందజేసిందన్నారు.

గత ప్రభుత్వాలు రజక సంఘాలకు ఇతర కుల సంఘాలకు ఎలాంటి న్యాయంగా చేకూర్చలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని కుల సంఘాలకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, నాచారం ట్రస్ట్ మాజీ చైర్మన్ హరి పంతులు, కిష్టాగౌడ్, మహేష్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కర్ణాకర్, మ్యాకల శ్రీనివాస్, చెక్కలి రాములు, అజయ్, రజక సంఘం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed