స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రజాభిప్రాయ సేకరణలో జాయింట్ కలెక్టర్

by Vinod kumar |
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రజాభిప్రాయ సేకరణలో జాయింట్ కలెక్టర్
X

దిశ, చిన్నశంకరంపేట: కంపెనీలు ఏర్పాటు చేయడం కాదు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం చిన్న శంకరంపేట మండలం కామారంలోని 165/అఆ1&అ3 సర్వే నంబర్‌లోని ఇన్స్ ఇన్స్పెక్టర్ ఎల్‌ఎల్‌ఎం పరిశ్రమ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు గ్రామాలలోని ఉన్న నిరుద్యోగుల యువకులకు నైపుణ్యం కల్పించి ఉపాధి కల్పించాలని కంపెనీ యజమాన్యానికి సూచించారు. 27 వేల టన్నుల నుండి లక్ష టన్నుల వరకు పెంచడం, సంవత్సరానికి 40 లక్షల టన్నులు రోలింగ్ మిల్లును చేర్చడం జరుగుతుంది. కామారం గ్రామ సర్పంచ్ పూలపల్లి యాదగిరి మాట్లాడుతూ.. పరిశ్రమలను విస్తరణ చేసుకోవాలి కానీ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, పర్యావరణకు చెట్లు నాటాలని, సూచించారు.

పీఎసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ శివారులో టైర్ల కంపెనీ, నుంచి అనేక కాలుష్యం వెదజల్లుతుందని ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ కలెక్టర్ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ.. ఎలక్షన్ కోడ్ ఉన్నందున కోడ్ తర్వాత అక్కడి ప్రాంతానికి వెళ్లి పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుందామని తెలిపారు. గ్రామాల చుట్టూ రోడ్లు అభివృద్ధి.. తదితర మౌలిక వసతుల కోసం 40 లక్షల రూపాయలు, అలాగే ఈ కంపెనీలో 70 ఉద్యోగాలు కల్పించాలని యజమాన్యం తెలిపిందన్నారు. ఈ నేపథ్యంలో వికలాంగులకు కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాలని జిల్లా వికలాంగుల సంఘం సంక్షేమ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కంపెనీ యజమాన్యం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమంలో కంపెనీ యజమానియా యజమాన్యం సతీష్ గర్గ్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహాశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి కుమార్ కట్టర్, ఎన్జీవోలు, ప్రజలు విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed