దామరకుంటను సందర్శించిన జలశక్తి అభియాన్ బృందం..

by Kalyani |
దామరకుంటను సందర్శించిన జలశక్తి అభియాన్ బృందం..
X

దిశ, ములుగు: జలమే జగతికి జీవనాధారం అని, అలాంటి జలాలను పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్ తరాల మనుగడకు దోహదం చేయాలని నేషనల్ జల శక్తి అభియాన్ అధికారుల బృందం తెలిపింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధి దామరకుంట గ్రామంలో చేపట్టిన జల సంరక్షణ పనులను గురువారం వారు పరిశీలించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రభుత్వ స్థలాల్లో నీటి గుంతలు వినియోగ తీరును అడిగి తెలుసుకున్నారు.

ఎంఐ ట్యాంకులు, చెక్ డ్యాంలు, ప్లాంటేషన్, హార్టికల్చర్, కూరగాయల పంటలను పరిశీలించి, తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయండం జరుగుతుందని వారు తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి గోపాల్ రావు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాయత్రి బాల్ నరసింహులు, ఎంపీటీసీ కృష్ణ యాదవ్, పీడీ, డీడీఎల్ డీపీవో, ఎంపీడీవో, ఎంపీవో, ఈసీ, ఏఈ ఇరిగేషన్, టీఏలు, పీఎస్‌లు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed