రెండేళ్లలో బీడు భూములన్నీ సస్యశ్యామలం : మంత్రి హరీష్‌ రావు

by Shiva |   ( Updated:2023-06-07 16:03:38.0  )
రెండేళ్లలో బీడు భూములన్నీ సస్యశ్యామలం : మంత్రి హరీష్‌ రావు
X

రూ.2,650 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోథల పథకం

సాగులోకి రానున్న 2.19 లక్షల ఎకరాల భూమి

దిశ, అందోల్ : బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తోందని, ఇందు కోసం అవసరమైన చోట్లలో ప్రాజెక్టులను నిర్మాణం చేపడుతుందని రాష్ట్ర అర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీష్‌రావు అన్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చెల్మేడ వద్ద సంగమేశ్వర ఎత్తిపోథల పథకం పనులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు.

నీటి పారుదల రంగంలో సాధించిన విజయాలకు సంబంధించిన బుక్ లెట్ ను మంత్రి విడుదల చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన వీడియోను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సింగూర్‌ ప్రాజెక్టు నీటిని జిల్లా వాసులకు దక్కాలన్న సంకల్పంతో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాలకు నీటిని అందించేందుకు సంగమేశ్వర ఎత్తిపోథల పథకాన్ని సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారన్నారు.

ఈ పథకం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం రూ.2,650 కోట్లను మంజూరు చేసిందన్నారు. గతంలో ఈ ప్రాంతాలు కరువు, కటకాలతో బాధపడేవని, తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎరుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. నీళ్లు లేక, కరెంట్‌ రాక, వానలు కురువక ఈ ప్రాంతాలు అగమయ్యాయని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. రైతన్నలు మొఘులుకు ముఖం పెట్టి వర్షాల కోసం ఎదురు చూసే రోజులు పోయినయ్‌ని ఆయన అన్నారు.

గత పాలకులు సింగూర్‌ ప్రాజెక్టు నిర్మించి జిల్లా వాసులకు చుక్కనీ టిని ఇవ్వకుండా, హైదరాబాద్‌కు తీసుకేళ్లారని ఆయన విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ సింగూర్‌ జలాలు ఉమ్మడి మెదక్, నిజామాబాద్‌ జిల్లాలకు దక్కాలన్న సంకల్పంతో ఎత్తిపోథల పనులను చేపడుతున్నారన్నారు. జంట నగరాలకు గోదావరి, కృష్ణ జలాలను రప్పించి, సింగూర్‌ నీటిని ఈ రెండు జిల్లాలకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందోలులో గతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారంతా స్థానికేతరులేనని, వారిని కలవాలంటే హైదరాబాద్‌ వరకు వేళ్లాల్సి వచ్చేదన్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను స్థానికుడని, మరోసారి అందోలు ప్రజలు అదరించాలని, స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘెత్తంరెడ్డి, జహిరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, హ్యండ్‌ లూం కార్పొరేషన్‌ చైర్మన్‌ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ అజయ్‌కుమార్, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మురళీధర్, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మఠం భిక్షపతి, గ్రంథాలయ చైర్మన్‌ నరహరరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రూ.100 కోట్లతో రోడ్ల పనులు...

అందోలు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ మెరుగుపరిచేందుకు, నూతనంగా రోడ్ల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించిందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణ పనులు కొన్ని చోట్లలో జరుగుతున్నాయని, మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉందన్నారు. సింగూర్‌ నీటిని అందోలు నియోజకవర్గానికి 40 వేల ఎకరాలకు పైగా సాగునీటిని అందిస్తున్నామన్నారు. సంగమేశ్వర, బస్వవేశ్వర పథకాలతో నియోజకవర్గ మంతా సస్యశ్యామలమవుతుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనేక్షన్‌లను అందించామని, తాగునీటి సమస్య లేకుండా చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు.

Advertisement

Next Story

Most Viewed