ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా.. జిల్లాలో 60 శాతం ఉత్తీర్ణత

by Shiva |
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా.. జిల్లాలో 60 శాతం ఉత్తీర్ణత
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర కన్నా బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. సిద్దిపేట జిల్లలాలో 20,448 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 12,281 (60శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో సూర్యప్రకాష్ పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలుపుకొని బాలురు 10,505 మంది పరీక్ష రాయగా 4722 (45 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 11,255 మంది పరీక్షలు రాయగా 7,559 (67 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఈయర్ జనరల్ విభాగంలో 8,145 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,315 ( 52శాతం ) మంది, వోకేషనల్ విభాగంలో 3,021 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,342 (44 శాతం ) మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఈయర్ జనరల్ విభాగంలో 7,703 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 5,045 (65 శాతం ) మంది, వోకేషనల్ విభాగంలో 2,891 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,579 (54శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

Next Story

Most Viewed