- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మీ అధికారి పేరిట.. ఘరానా మోసం
దిశ, సిద్దిపేట ప్రతినిధి: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో ఘరానా మోసాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. సిద్దిపేట వన్ టౌన్ పరిధిలోని ఓ ఫర్నిచర్ షాప్ యజమానికి సైబర్ నేరస్థుడు ఆర్మీలో పనిచేస్తున్నట్లు ఫోన్ చేశాడు. తక్కువ రేట్‌కు మంచి క్వాలిటీ పరుపులు పంపిస్తానని తెలుపగా, నమ్మిన బాధితుడు సైబర్ నేరస్థుడు సూచించిన ఫోన్ నెంబర్‌కు మొదట ఒక రూపాయి, తరువాత రెండు రూపాయాలు పంపించాడు. తరువాత సైబర్ నేరస్థుడు పంపించిన క్యూఆర్ కోడ్‌ను బాధితుడు స్కాన్ చేయగానే అకౌంట్ నుంచి రూ. 51,997 డెబిట్ అయ్యాయి. సిద్దిపేట టూ టౌన్ పరిధిలోని ఓ బాధితుడికి రూ.5 లక్షల లోన్ ఇస్తామని సైబర్ నేరగాడు నమ్మబలికి ఇన్సూరెన్స్, జీఎస్టీ, ఇతర ప్రాసెసింగ్ చార్జీల పేరిట రూ. 63,350 కాజేశాడు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాధితుడిని ఉద్యోగం పేరిట రూ.30,600 సైబర్ నేరస్థుడు కాజేశాడు. ఈ ఘటనలతో బాధితులు జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు.