సైఫ్ ను బహిరంగంగా ఉరితీయండి: గిరిజన సంఘాలు

by Kalyani |
సైఫ్ ను బహిరంగంగా ఉరితీయండి: గిరిజన సంఘాలు
X

దిశ, హుస్నాబాద్: పీజీ వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతి మృతికి కారకుడైన మహమ్మద్ సైఫ్ ను ఎన్ కౌంటర్ చేయాలని లేదా బహిరంగంగా ఉరి తీయాలని సోమవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గిరిజన నాయకులు దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటసేపు రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రియాంక రెడ్డిని దిశ ఎన్ కౌంటర్ చేసిన ప్రభుత్వం, నేడు ఒక గిరిజన ఆడ బిడ్డ ధరావత్ ప్రీతి మృతి చెందితే తుపాకులు, బుల్లెట్లు పనిచేయడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రీతిది 100% హత్యేనని ప్రభుత్వం వెంటనే కేఎంసీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హెచ్ఓడీ, సైఫ్ తో కుమ్మక్కై ప్రీతి మృతికి కారకులయ్యారని ఆరోపించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే ప్రీతి కుటుంబానికి ఐదు కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రాజు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి నాయక్, నియోజకవర్గ ఇంచార్జి, బంజారాల ఆటో యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed