అట్టహాసంగా హనుమాన్ జయంతి వేడుకలు

by Shiva |
అట్టహాసంగా హనుమాన్ జయంతి వేడుకలు
X

దిశ, నర్సాపూర్ : హనుమాన్ జయంతి వేడుకలు నర్సాపూర్ నియోజకవర్గంలో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలో నెలకొని ఉన్న జల హనుమాన్ దేవాలయంలో హనుమాన్ ఆలయంలో హనుమాన్ నామ స్మరణతో మారుమోగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. టీపీసీసీ రాష్ట్ర నాయకుడు ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు అశోక్ గౌడ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి ఆశీస్సులతో అందరికి శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం స్వామి వారి సేవ పల్లకి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి సర్పంచ్ నర్సింహులు, గురు స్వాములు యాదగౌడ్, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, ప్రభు గౌడ్, నరేశ్ యాదవ్, లింగం గౌడ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story