- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ అధ్యాపకుడు జి.రవికుమార్ గౌడ్ సస్పెన్సన్
దిశ, సంగారెడ్డి : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సదాశివపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుని విధులు నిర్వహిస్తున్న రవికుమార్ గౌడ్ ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు. రవికుమార్ గౌడ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడని , పండరినాయక్, ఎల్లయ్య ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేయగా అతడు సోషల్ మీడియాలో, వార్తాపత్రికల విచారణ చేయగా నిజమని తేలిందని కలెక్టర్ వివరించారు. దీంతో సదరు అధ్యాపకుడిపై తెలంగాణ సివిల్ సర్వీస్ (సీసీఏ) రూల్స్ ప్రకారం సస్పెన్షన్ వేటు విధించడం జరిగిందని తెలిపారు. ఉద్యోగులందరూ ఎన్నికల నియమాలకు లోబడి పని చేయాలని ఆదేశించారు.
కోహీర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్..
కోహీర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మణాచారిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలు జారీచేశారు. గ్రామంలో డంపింగ్ యార్డ్, గ్రామంలో సురక్షితమైన తాగునీటి సరఫరాలో విఫలమయ్యారని తెలిపారు. డంప్‌యార్డులో కాకుండా రోడ్లపైనే చెత్త వేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం దహనం చేయడం పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్ ఆర్డర్లు కలెక్టర్ జారీ చేశారు.