- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ అభివృద్ధి పనులను ఇంటింటికీ తెలపాలి : మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను పల్లెపల్లెనా ప్రతి ఇంటింటికీ తెలియజేయాల్సిన బాధ్యత విద్యార్థి విభాగం నాయకులదేనని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అదివారం నియోజకవర్గ బీఆర్ఎస్వీ నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నియోజక వర్గాన్ని చక్కగా అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా విద్యాక్షేత్రంగా కూడా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇతర నియోజకవర్గాల వారు చూసి నేర్చుకునేలా తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. పల్లెపల్లెనా విద్యార్థి ఆత్మీయ సమావేశాలు నిర్వహించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేష్, నియోజకవర్గ అధ్యక్షుడు శ్యాంయాదవ్, కన్వీనర్ రామ్మోహన్, పట్టణ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు మహిపాల్ గౌడ్, విద్యార్థి విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.