మూతపడ్డ పరిశ్రమలో అగ్నిప్రమాదం..

by Kalyani |
మూతపడ్డ పరిశ్రమలో అగ్నిప్రమాదం..
X

దిశ, మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్న మూతపడ్డ పరిశ్రమలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పరిశ్రమ వెనుక భాగంలో ఉన్న పిచ్చి మొక్కలు, గడ్డి మంటలు అంటుకొని పరిశ్రమలోకి వ్యాపించడంతో పరిశ్రమలో ఉన్న పాత వస్తువులు, టైర్లు, స్క్రాప్ తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు రామాయంపేట, కౌడిపల్లిల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పేశారు. కొన్నేళ్ల క్రితం ఈ పరిశ్రమను యాజమానులు మూసేశారని, ప్రస్తుతం ఈ పరిశ్రమ బ్యాంకు ఆధీనంలో ఉన్నందున సంబంధిత బ్యాంక్ అధికారులు వచ్చే పరిశీలించినట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed