సొంత కూతురిపై అత్యాచారం కేసులో తండ్రికి జీవిత ఖైదు

by Shiva |
సొంత కూతురిపై అత్యాచారం కేసులో తండ్రికి జీవిత ఖైదు
X

దిశ, పటాన్ చెరు: సొంత కూతురిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందుతుడికి పొక్సో స్పెషల్ కోర్ట్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐలాపూర్ గ్రామానికి చెందిన అలెటి రమేష్ 2021, ఆగస్ట్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన సొంత కూతురు (మైనర్)పై అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు.

అయితే, బాలిక తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసు విచారణ అధికారిగా ఉన్న అమీన్ పూర్ సీఐ శ్రీనివాసులు రెడ్డి పూర్తి విచారణ జరిపి పక్కా సాక్ష్యాధారలను న్యాయస్థానానికి సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట సంగారెడ్డి ఫోక్సో స్పెషల్ కోర్టు రమేష్ ను దోషిగా తేల్చించి. సెక్షన్ 376(2),506 ఫోక్సో చట్టం కింద జీవిత ఖైదుతో పాటు రూ.2 వేలు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి సుదర్శన్ తుది తీర్పును వెలువరించారు.

Advertisement

Next Story

Most Viewed