Medak MLA : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

by Kalyani |
Medak MLA : దళారులను నమ్మి  రైతులు మోసపోవద్దు
X

దిశ, నిజాంపేట : ఆరుకాలం కష్టించి పండించిన పంటను దళారులని నమ్మి తక్కువ ధరలకు విక్రయించొద్దని మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నార్లపూర్ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఏ రకం ధాన్యానికి రూ, 2,320..సాధారణ రకానికి రూ . 2,300 లతో సన్నాళ్లకు రూ. 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుప్రభాతరావు, అమర్సేనారెడ్డి, పంజా మహేందర్, నజీరుద్దీన్, వెంకట్ గౌడ్, రవీందర్ రెడ్డి, కుమార్, నర్సిములు తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed