రైతులకు వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి

by Sridhar Babu |
రైతులకు వెంటనే  రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి
X

దిశ, సంగారెడ్డి : రైతుల రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో రుణమాఫీ చేయాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డీఆర్ఓ పద్మజారాణి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతుల రుణాలు రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు పరిగణలోకి తీసుకోవడంతో అనేకమంది రైతులకు రుణమాఫీ రాలేదన్నారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్, పట్టాపాస్ బుక్ లో తప్పులు ఉన్న రైతుకు రుణమాఫీ రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే టెక్నికల్ సమస్యలు పరిష్కరించి రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా సభ్యులు బి.మల్లేశం, మాణిక్యం, జి.సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, ఎం.నర్సింలు, నాయకులు కృష్ణ, మల్లారెడ్డి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story