- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : ఎమ్మెల్యే మాధవనెని రఘునందన్ రావు
దిగుమతి హమాలీ ప్రభుత్వమే భరించాలి
శాశ్వతంగా ఆథరైజేషన్ ఇవ్వాలి
దిశ, దుబ్బాక : రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, వారికి ప్రతి నెలా గౌరవ వేతనం ఇవ్వలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లా రేషన్ డీలార్ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు కు సమస్యలపై వినతిపత్రంను అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు జూన్ 5 నుంచి సమ్మె కార్యక్రమానికి రేషన్ డిలర్లకు తను పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతినిత్యం గ్రామాలలో 600 నుంచి 1000 మందికి పేద ప్రజలకు బియ్యం ఇస్తూ రేషన్ షాపు నడిపిస్తున్న డీలర్లకు గౌరవ వేతనం కల్పించాలన్నారు. పక్క రాష్ట్రాల్లోని ఏ విధంగానైతే క్వింటాలుకు 150 నుంచి 300 వరకు కమిషన్ ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా ఇవ్వాలన్నారు.
ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆ విధంగా లేకపోవడం రేషన్ డీలర్లను నష్టం చేసినట్లేనని పక్క రాష్ట్రాలలో మిత్రపక్షం అని చెప్పుకుంటూ తిరుగుతున్న సీఎం అక్కడ ఎలాగైతే రేషన్ డీలర్లకు గౌరవ వేతనం మరియు కమిషన్ ఉంటుందో అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. పొద్దున లేస్తే సమస్యలతో సమ్మెలతో తెలంగాణ రాష్ట్రం నిద్రలేస్తుందని ఆ సమస్యలను సీఎం కేసీఆర్ సమస్యలపై స్పందించి రేషన్ డీలర్లకు గౌరవ వేతనం అందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
లేని పక్షంలో రేషన్ డీలర్లు చేపట్టే ప్రతి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తున్నా అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కిలోల బియ్యం ఎటుపోయాయని ప్రశ్నించారు. ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే కిలో బియ్యం ఇచ్చి ఆరు కిలోల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మేమే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు.
పక్క రాష్ట్రాలైన అస్సాం, ఢిల్లీ, కమ్యూనిస్టు రాష్ట్రమైన కేరళలో కూడా రేషన్ డీలర్లకు నెల నెల వేతనాలు ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రం లో కేసీఆర్ రేషన్ డీలర్ల పొట్ట కొట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. కేంద్రం నుంచి రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ దగ్గర పెట్టుకొని డీలర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.