- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాయపోల్ వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు
సమయపాలన పాటించని వైన్ షాపులను సీజ్ చేస్తాం
మిరుదొడ్డి ఎక్సైజ్ ఎస్సై మహమ్మద్ జహీర్
దిశ రాయపోల్ : రాయపోల్ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ వైన్స్ షాపును మంగళవారం మిరుదొడ్డి ఎక్సైజ్ శాఖ ఎస్సై మహమ్మద్ జహీర్ ఆధ్వర్యంలో మంగళవారం వైన్స్ ను తనిఖీ చేశారు. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్ ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా షాప్ లో ఉన్న మద్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం మద్యం రేట్లను తగ్గించడంతో వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని మద్యం బాటిళ్లపై కంపెనీ స్టిక్కర్ లేకుండా అమ్ముతున్నట్లు వెలుగులోకి రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం విధించిన విధివిధానాలకు అనుకులంగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ ఎస్సై జహీర్ హెచ్చరించారు. వైన్స్ షాప్ యజమానులు ఖచ్చితంగా సమయపాల పాటించాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాయపోల్ వైన్ షాపులో బాటిల్ కంపెనీ స్టిక్కర్ లేకుండా అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని . ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చిరించారు. గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వైన్ షాపుల ద్వారా ఎమ్మార్పీ రేట్లు కొనుగోలు చేసి గ్రామాల్లో ఉచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అధిక ధరలకు విక్రయించడంతో గ్రామాల్లో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బెల్ట్ షాప్ లు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్సై స్పష్టం చేశారు. రాయపోల్ వైన్స్ ఎదుట టర్నింగ్ ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే అవకాశం ఉందని వైన్స్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ తనిఖీల్లో మిరుదొడ్డి ఎక్సైజ్ శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.