- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొమురెల్లి మల్లన్న కల్యాణానికి అంతా సిద్ధం
దిశ, కొమురవెల్లి: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మల్లన్న కల్యాణం తోట బావి వద్ద ఏర్పాటుచేసిన మండపంలో వీరశైవ ఆగమన శాస్త్ర ప్రకారం గొల్ల కేతమ్మ మెడలాదేవీలతో జరగనుంది. బార్షి గృహ సిద్ధగురువు మణికంఠ శివచార్యులతో పాటు పలువురు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున మంత్రి హరీష్ రావు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వర్ణ కిరీటం స్వామివారికి సమర్పనించనున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే మంచినీరు, చలువ పందిళ్ళు, వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు చేశారు.
మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు మల్లికార్జున స్వామి రథోత్సవం నిర్వహిస్తారు. స్వామి వారికి స్వర్ణ కిరీటాన్ని మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సమర్పించనున్నారు. అనంతరం ముఖ మండపం ప్రారంభోత్సవం చేయనున్నారు.