పట్ట పగలే అక్రమ ఇసుక దందా..!

by Prasanna |
పట్ట పగలే అక్రమ ఇసుక దందా..!
X

దిశ ప్రతినిధి,మెదక్: అక్రమ ఇసుక దందా మెదక్ పట్టణంలో లీగల్ గా మారిందా! లేక అధికారులు మాకెందుకు అని అనుకుంటున్నారా..లేక అక్రమ వ్యాపారాలు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుందో తెలియడం లేదు. కానీ మెదక్ పట్టణ శివారులోని పుష్పాల వాగులో నుంచి పట్ట పగలే అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతున్న అధికారులు మాత్రం అటువైపు రావడం లేదు. మెదక్ పట్టణ శివారులోని పుష్పాల వాగులో నుంచి ఆదివారం ఉదయం నుంచి పది ట్రాక్టర్ లలో అక్రమ ఇసుక దందా బహిరంగ సాగుతుంది. ఇది ఎక్కడో అటవీ ప్రాంతంలో సాగితే అధికారులకు తెలియదని భావించవచ్చు.

కానీ..మెదక్ - చేగుంట ప్రధాన రహదారి మెదక్ పట్టణ శివారులో అక్రమ ఇసుక ట్రాక్టర్ లలో తరలిస్తున్నారు. బ్రిడ్జి పై వెళ్ళే ప్రతి ఒక్కరికీ ఇసుక దందా తెలిసిపోతున్న అధికారుల దృష్టికి వరకు వెళ్లలేదంటే అనుమానాలకు తావిస్తుంది. అధికారులే ముందుగా అక్రమ వ్యాపారులకు ఆదివారం ఇసుక తరలించుకోవచ్చని చెప్పడం వల్ల దర్జాగా సుమారు పది ట్రాక్టర్ లలో ఇసుక తరలించి డంప్ చేస్తున్నారు. వందలాది ట్రాక్టర్ల ఇసుక తరలిపోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక ను అడ్డుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed