రెండో విడతలో పదవులు దక్కించుకోవాలని కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు

by Anjali |
రెండో విడతలో పదవులు దక్కించుకోవాలని  కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మొదటి విడుత నామినేటెడ్ పోస్టుల భర్తీలో సిద్దిపేట జిల్లాకు ప్రాతినిధ్యం దక్కకపోవడంతో నైరాశ్యానికి గురైన కాంగ్రెస్ నాయకులు రెండో విడుతలో పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అధికారంలో లేకపోయినా పదేళ్లు పార్టీలోనే ఉన్నాం. ఈసారి ఎలాగైనా నామినేటెడ్ పోస్టు ఇప్పించాలని జిల్లాకు చెందిన పలువురు నాయకులు పార్టీ కీలక నేతల ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈసారి ఎలాగైనా నామినేటెడ్ పోస్టు ఇప్పించాలని జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రదాన లీడర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసింది.

నామినేటెడ్ పదవిపై ఆశ పెట్టుకున్న జిల్లాకు చెందిన నాయకులకు మొదటి విడుత నామినేటెడ్ పోస్టుల భర్తీలో మొండి చేయి ఎదురుకావడంతో నిరాశకు గురయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లాకు ప్రాధాన్యం లభించకపోవడం కారణాలేంటి..? రెండో విడుతలో ప్రాధాన్యం ఉంటుందా..? లేదా..? అని లెక్కలేసుకుంటున్న హస్తం పార్టీ నాయకులు ఈసారి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీ నేతల ఆశలు రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీలో నెరవేరుతుందో.. లేదో చూడాలి మరి.

* గత ప్రభుత్వంలో కీలక పోస్టులు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లాల నాయకులకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో కీలక పోస్టులు దక్కాయి. ఫారెస్టు డెవలప్‌మెంట్ చైర్మన్, తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ (టీజీ ఐఐసీ), పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగు సాహిత్య అకాడమి చైర్మన్, ఎస్సీ కమిషన్ చైర్మన్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ తదితర పోస్టులు జిల్లా లీడర్లకు దక్కాయి.

మంత్రులు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల కోసం సీనియర్ నాయకులతో పాటు, యువ లీడర్లు సైతం హై కమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. అయితే మొదటి విడతలో నామినేటెడ్ పోస్టు వస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన గూడూరు శ్రీనివాస్ కు చివరి నిమిషంలో పదవి దక్కలేదనే టాక్ నడుస్తుంది. అదే విధంగా కార్మిక నాయకుడు సిద్దిపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఫార్మర్స్ పస్ట్ ఫౌండేషన్ చైర్మన్ గాదగోని చక్రధర్ గౌడ్ తదితరులు నామినేటెడ్ పోస్టుల కోసం గట్టి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా మార్కెట్ కమిటీలు, సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న సిద్దిపేట నియోజకవర్గ నాయకులు జిల్లా మంత్రి, కీలక నాయకుల ఆశీస్సులు తమకే ఉన్నాయని.. పోస్టు తనకే వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఏదిఏమైనప్పటికీ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీ నేతల ఆశలు రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీలో నెరవేరుతుందో.. లేదో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed