- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు : ఎస్పీ చెన్నూరి రూపేష్
దిశ, సంగారెడ్డి : ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని వారి బారిన పడొద్దని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు. బుధవారం సైబర్ జాగురుకత దివాస్ ను పురస్కరించుకొని “జాగరూక్ సీనియర్ సిటిజన్” కార్యక్రమం పేరుతో జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కు సైబర్ నేరాలపై టీఎన్జీవో భవన్ లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆదేశాలతో సైబర్ నేరాలను అట్టడానికి ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగురుకత దివాస్ పేరుతో మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫోన్ లకు వచ్చే అనవసర లింకులు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకూడదన్నారు. అనంతరం సైబర్ సెల్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని, సైబర్ నేరాలకు గురి అవుతున్న వాళ్ళల్లో అధికంగా విద్యావంతులే ఉండటం దురదృష్టకరం అన్నారు.
సైబర్ నేరగాళ్లు మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల ప్రభుత్వ స్కీమ్స్, నఖిలి కరెంట్ బిల్, ఆన్లైన్ లో కొరియర్, లోన్ యాప్ మరియు వివిధ రకాల apk ఫైల్స్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను సైబర్ బాధితులుగా చేస్తున్నారన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో గుర్తు తెలియని, కొత్త ఫోన్ నెంబర్ ల నుండి పరిచిత వ్యక్తి వీడియో కాల్ చేసి, వీడియో రికార్డు చేసి బెదిరించడం, పోలీసు అధికారులం, కస్టమ్స్ అధికారులం అని కాల్స్ వస్తే భయపడవద్దని, ఏ పోలీసు అధికారి వీడియో కాల్ చేయరని గుర్తించాలన్నారు. సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, NCRP పోర్టల్ https://www.cybercrime.gov.in/ నందు లాగిన్ అయి ఫిర్యాదు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నగేష్, టెక్నికల్ సపోర్ట్ పర్సన్ రాజలింగం, సంగారెడ్డి టౌన్ ఎస్సై నర్సింహులు, ఐటీ సెల్ సిబ్బంది మరియు సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.