- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయోద్దు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : జీవ వైవిధ్యం విధ్వంసం కాకుండా చూడాలని ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ రెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మొక్కలను కల్టివేట్ చేయడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించడంతో పాటుగా గ్లోబల్ వార్మింగ్‌ని తగ్గించవచ్చు అన్నారు. ప్రొఫెసర్ ముస్తఫా సహజ పరిస్థితులను ఉపయోగించి జీవ వైవిద్యాన్ని ఏవిధంగా కాపాడవచ్చో వివరించారు. ఐఎస్ఆర్వో సీనియర్ సైంటిస్ట్ సుధాకర్ రెడ్డి ఫ్లోరా గురించి వివరించారు. ఈ సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల పరిశోధకులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డా. రాణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వాసం శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు శ్యాంసుందర్, విద్యార్థులు పాల్గొన్నారు.