వైద్యులు అంకితభావంతో పని చేయాలి : కలెక్టర్ డాక్టర్ శరత్

by Shiva |
వైద్యులు అంకితభావంతో పని చేయాలి : కలెక్టర్ డాక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి : వైద్యులు అంకితభావంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ శరత్ ఆరోగ్య మహిళా కేంద్రాల వైద్య సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూరింటెండెంట్, తదితరులతో ఆరోగ్య మహిళ కార్యక్రమం పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం చేపట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమ లక్ష్యం నెరవేరేలా సంబంధిత వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. జిల్లాలో ప్రతి మంగళవారం బిలాల్పూర్, ఝరాసంగం, జిన్నారం, ఆర్సీ పూర్ లలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కేంద్రాల్లో ఓపీ మరింత పెరగాలన్నారు. అదే విధంగా డయాగ్నస్టిక్ వంద శాతం జరగాలని సూచించారు. ప్రతివారం ఆరోగ్య మహిళా కేంద్రాలను సందర్శించాలని డీఆర్డీవో, జడ్పీ సీఈవోలకు సూచించారు.

జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఆరోగ్య మహిళకు సంబంధించిన ఆయా సిస్టమ్ ఏర్పాటు చేయాలని, వచ్చిన రెఫరల్ కేసులన్నింటికి మోమోగ్రఫీ చేయాలని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ కు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ గాయత్రీ దేవి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెండ్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ నాగలక్ష్మి, డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మెప్మా పీడీ గీత, బిలాల్పూర్, ఝరాసంగం, జిన్నారం, ఆర్సీ పురం పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story