Disha effect : దిశ ఎఫెక్ట్...వరద కాలువ పునరుద్ధరణ

by Sridhar Babu |
Disha effect : దిశ ఎఫెక్ట్...వరద కాలువ పునరుద్ధరణ
X

దిశ,పటాన్ చెరు : అమీన్ పూర్ పెద్ద చెరువుతో పాటు కొత్త చెరువు నుంచి బంధం కొమ్ము చెరువులోకి నీరు వెళ్లే వరద కాలువ ఆక్రమణలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సీరియస్ అయ్యారు. వరద కాలువ పునరుద్ధరణకు ఆటంకాలు ఏర్పడడంతో దిశ దినపత్రిక కాలువ నిర్మాణానికి మోకాలడ్డు పేరుతో కథనాన్ని ప్రచురించింది. వరద కాలువ పునరుద్ధరణకు జరుగుతున్న ఆటంకాల వల్ల పక్క కాలనీలు ముంపునకు గురవుతున్న విషయాన్ని దిశ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే వరద కాలువలను

పునరుద్ధరించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రొక్లేనర్ సహాయంతో వరద కాలువను పునరుద్ధరించారు. అమీన్ పూర్ ఏఈఈ సంతోషి పునరుద్ధరణ పనులను పరిశీలించి కాలువ వెళ్లే మార్గంలో అడ్డంకిగా ఉన్న మట్టి కుప్పలను తొలగించేలా చూశారు. వరద కాలువలను పునరుద్ధరించడంతో కాలనీవాసులకి వరద నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. వరద కాలువ సమస్యను వెలుగులోకి తెచ్చి కాలువ పునరుద్ధరణకు సహకరించిన దిశ దినపత్రికను కాలనీవాసులు అభినందిస్తున్నారు.



Next Story

Most Viewed