- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ కార్డు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి.. కలెక్టర్
దిశ, సదాశివపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సదాశివపేట పట్టణంలోని 26 వార్డులో సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద పురపాలక సంఘంలోని 26 వార్డును ఎంపిక చేశామన్నారు. సర్వే సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలను నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రభుత్వం అర్హులైన ప్రజలందరికి కుటుంబ డిజిటల్ కార్డు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇంటింటా చేపట్టే సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జే.ఉమా, ఎమ్మార్వో సరస్వతి, మున్సిపల్ మేనేజర్ డి.ఉమేందర్ సింగ్, మున్సిపల్ ఇంజనీర్ ఏ.రాజేష్ కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.