- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేతకిలో పోటెత్తిన భక్తులు
దిశ, ఝరాసంగం : అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం దేవస్థానంలో సోమవారం అమావాస్య శ్రావణమాసం ముగింపు సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలు నంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులు వేకువజాము నుంచి భారీగా తరలివచ్చారు. స్వామివారి పుష్కరిణి, అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరారు. ఓం నమశ్శివాయ..హర హర శంభోశంకర మహదేవా అంటూ భక్తులు చేసిన నామస్మరణతో కేతకి పరిసరాలు ప్రతిధ్వనించాయి.
భక్తులకు స్వామివారి దర్శనం సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి శశిధర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కర్ణాటక హుమ్నాబాద్ భాజపా ఎమ్మెల్యే సిద్దు పాటిల్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. అదేవిధంగా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమం, కుప్పా నగర్ గుబ్బడి సంగమేశ్వర స్వామి, ఈద్దులపల్లి రేవన సిద్దేశ్వర స్వామి, పొట్టి పల్లి సిద్దేశ్వర దేవాలయం, మాచునూర్ రామలింగేశ్వర దేవాలయాల్లో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Tags
- Ketaki