- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఐలాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
by Nagam Mallesh |
X
దిశ, పటాన్ చెరుః అమీన్ పూర్ మండలం ఐలాపూర్ లో వివాదాస్పద భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. అమీన్ పూర్ తహసీల్దార్ రాధ నేతృత్వంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం జేసీబీలతో రెవిన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారుల బృందం పోలీస్ ప్రొటెక్షన్ తో ఐలాపూర్ తండాకు చేరుకున్నారు. వివాదాస్పద భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించారు. అమీన్ పూర్ తహసిల్దార్ రాధా మాట్లాడుతూ ఐలాపూర్, ఐలాపూర్ తండాలోని కోటి పరిధిలో ఉన్న వివాదాస్పద భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని, ఎటువంటి లావాదేవీలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story