- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్...
దిశ, అందోల్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా నియమితులైన సీలారపు దామోదర్ రాజనర్సింహ గురువారం బాధ్యతలను స్వీకరించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలోని రెండవ అంతస్తులో తనకు కేటాయించిన కార్యాలయంలో వేద బ్రహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య దామోదర్ ఆయన సతీమణి పద్మిణీ, కూతురు త్రిషతో కలిసి ప్రత్యేక పూజలు చేసి, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం మంత్రిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సచివాలయానికి తరలివెళ్లారు.
మంత్రి దామోదర్‌కు పుష్పగుచ్చాలను అందజేసి, శాలువాలు కప్పిఘనంగా సత్కరించి, పెద్ద సంఖ్యలో నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో ముఖ్యనాయకులు ఎస్.సురేందర్‌గౌడ్, ఎస్.కృష్ణా రెడ్డి, రంగ సురేష్, ఎ.చిట్టిబాబు, రేఖ ప్రవీణ్, డి.శంకర్, హరికృష్ణ గౌడ్, నాగరాజు, దుర్గేష్, చందర్, అల్లె శ్రీకాంత్, డీజీ.వెంకటేశం, సంగమేశ్వర్, శివరాజ్, గజ్జాడ కిషన్, రమేష్ జ్యోషి, రాంరెడ్డి, మాణిక్యంగౌడ్, మన్నె నరేందర్, రాజశేఖర్, రాజిరెడ్డితో పాటు తదితరులు దామోదర్‌ను కలిసిన అభినందనలు, శుభకాంక్షలను తెలియజేశారు.