అండర్ 16 జట్టుకు సిరిల్ డాల్సన్ ఎంపిక

by S Gopi |
అండర్ 16 జట్టుకు సిరిల్ డాల్సన్ ఎంపిక
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: గుజరాత్ లోని వడోదరలో నిర్వహించనున్న మర్చంట్ ట్రోఫీలో పాల్గొననున్న రాష్ట్ర స్థాయి అండర్ 16 జట్టులో సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు ఎం. సిరిల్ డాల్సన్ కు స్థానం లభించింది. హెచ్ సీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపిక ప్రక్రియలో సిరిల్ డాల్సన్ అల్ రౌండర్ గా ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ కలకుంట్ల మల్లికార్జున్ మాట్లాడుతూ..మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో క్రికెట్ క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుండటంతో రాష్ట్ర, జిల్లా, రంజి పోటీలల్లో క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సిరిల్ డాల్సన్ ను మంత్రి తన్నీరు హరీష్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, జమ్మూకాన్, సామలేటి మహేష్, విజయ్, మాజిద్, బాబు, మధు తదితరులు అభినందించారు.

Next Story