నీలం మధుకు సీపీఎం సంపూర్ణ మద్దతు..

by Nagaya |
నీలం మధుకు సీపీఎం సంపూర్ణ మద్దతు..
X

దిశ , సంగారెడ్డి : మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం తెలిపారు. మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డితో కలిసి నీలం మధు సంగారెడ్డిలోని సీపీఎం కార్యాలయంలో వారిని కలిశారు. అనంతరం వారితో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం మద్దతు కోరినట్లు నీలం మధు పేర్కొన్నారు. దీంతో సీపీఎం సంపూర్ణ ఇస్తామని గొల్లపల్లి జయరాజ్, మాణిక్యం చెప్పారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు సీపీఎం నేతలు, నాయకులు, కార్యకర్తలు పని చేస్తారన్నారు. జిల్లాలోని సీఐటీయూ, అనుబంధ సంఘాలన్నింటిని ఐక్యం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు శ్రమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, నరసింహులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed