- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సన్ పరివార్ డబ్బుల కోసం దంపతులు ఆత్మహత్య యత్నం..
దిశ, జగదేవపూర్ : సన్ పరివార్ మార్కెటింగ్ కుంభకోణంలో చిక్కుకొని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలు జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన జనగామ మాణిక్యం, ఉమారాణి దంపతులు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా మాణిక్యం కు 2017 సంవత్సరంలో ప్రమాదం జరిగిన కొద్ది నెలలకు తిరిగి ఇంటికి వచ్చాడు. మాణిక్యంకు బంధువైన గజ్వేల్ కు చెందిన చంద్రం ద్వారా సన్ పరివార్ మార్కెటింగ్ సీఈఓ మెతుకు రవీందర్ తో 2018 సంవత్సరం లో పరిచయం ఏర్పడింది. మెతుకు చిట్ ఫండ్ లో చేరితే డబ్బులు ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చని సీఈవో మెతుకు రవీందర్ నమ్మించి మాణిక్యమును ఏజెంట్ గా చేర్చుకున్నారు. చిట్ ఫండ్ లో చేర్పిస్తే లక్షకు ఆరువేల చొప్పున కమిషన్ వస్తుందని మాణిక్యంను నమ్మించడంతో సొంత గ్రామంలో మాణిక్యం 10 మంది సభ్యులను మెతుకు చిట్ ఫండ్ లో చేర్పించి దాదాపు రూ.10లక్షల వరకు కట్టించారు.
మాణిక్యం చెప్పడంతో చిట్ ఫండ్ లో చేరిన బాధితులు ఐదేళ్లు గడుస్తున్న మా డబ్బులు ఇంకా రావడం లేదని గ్రామంలో నిలదీశారు. దీంతో సన్ పరివార్ గ్రూప్ సీఈఓ రవీందర్ ను మాణిక్యం సంప్రదించగా మీ డబ్బులు త్వరలో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గత కొద్దిరోజులుగా సీఈఓ రవీందర్ ఫోన్ ఎత్తకపోవడం, చిట్ ఫండ్ బాధితులు మాణిక్యమును తిరిగి మా డబ్బులు మాకు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో గత రెండు రోజుల క్రితం వట్టిపల్లి నుండి బంధువుల ఇంటికి వెళుతున్నానని గ్రామస్తులకు చెప్పి వెళ్ళాడు. గురువారం గజ్వేల్ లోని మాణిక్యంకు బంధువైన చంద్రం ఇంటి వద్ద చిట్ ఫండ్ కు సంబంధించిన డబ్బుల గురించి వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఇద్దరు చంద్రం ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. కాగా గమనించిన స్థానికులు వెంటనే గజ్వేల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తలు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.