కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తా

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తా
X

దిశ, చిన్నశంకరంపేట : ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్​ విసిరారు. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్​ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో రాజీనామా చేయాలంటే రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్లు ఇచ్చారని, కిషన్ రెడ్డి తిప్పించుకొన్నాడని గుర్తుచేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతు బంధు పథకం, కళ్యాణ్ లక్ష్మి, మహాలక్ష్మి పథకం, నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని మాయమాటలు చెప్పి నేటి వరకు అమలు చేయడం

లేదని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి ఆదర్శం ఉంటే, నేటి సీఎం రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామాకు సిద్దంగా ఉన్నట్లు పునరుద్ఘటించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారెంటీ లు అమలు చేస్తావో లేదో రేవంత్ రెడ్డి సొల్లు లేకుండా సీదాగా..సూటిగా చెప్పాలన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదు రైతులు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమన్నారు. రుణమాఫీ చెయ్యాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు ఎలా తిడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తా అన్నారు. జిల్లాను రద్దు చేయాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నేటికీ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని పేర్కొన్నారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బందిగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆశీర్వదించండి.. నా జీవితమంతా ప్రజాసేవకే అంకితం : ఎంపీ వెంకట్రామిరెడ్డి

తాను ఎంతో కష్టపడి చదివి జిల్లా కలెక్టర్ గా మెదక్ జిల్లాలో 11 సంవత్సరాల పాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలో పనిచేశానని తెలిపారు. ప్రధానంగా మెదక్ స్థానానికి త్రిముఖ పోటీ ఉందని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనని దీవించాలని కోరారు. పేద విద్యార్థుల కోసం తన కుటుంబ సంపాదన తో ట్రస్టు ఏర్పాటు చేసి ఏడు నియోజకవర్గాల్లో తన సొంత డబ్బులతో ఫంక్షన్ హాల్ నిర్మించి ఒక్క రూపాయితోనే వివాహం చేసుకోవచ్చని సూచించారు. నిరుద్యోగులకు మెదక్ లోనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, గంగాధర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు, జడ్పిటిసి మాధవి, లక్ష్మారెడ్డి, సర్పంచ్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed