కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు సమన్యాయం.. నీలం మధు ముదిరాజ్

by Sumithra |
కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు సమన్యాయం.. నీలం మధు ముదిరాజ్
X

దిశ, పటాన్ చెరు : నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని మెదక్ పార్లమెంటు కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. నూతన టీపీసీసీ రథసారథిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అసెంబ్లీ గన్ పార్క్ నుంచి గాంధీభవన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గన్ పార్క్ వద్ద ఆయనను కలిసి నీలం మధు శుభాకాంక్షలు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ బీసీ బిడ్డకు పెద్ద పీట వేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నాయకత్వ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి రుణపడి ఉంటామన్నారు. అన్ని వర్గాలకు సమంగా ప్రాధాన్యతనిస్తూ ఓట్లతో పాటు రాజకీయ అధికారం సైతం అప్పగిస్తూ అన్ని వర్గాలను ప్రోత్సహిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఒకవైపు బీసీలకు రాజకీయ అవకాశాలు మరింతగా పెంపొందించేందుకు బీసీ కుల గణనను త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. బీసీ బిడ్డకు పీసీసీ రథసారధిగా అవకాశం కల్పించేలా ప్రోత్సహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యనాయకులకు బీసీ కులాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story