కాంగ్రెస్ పాలన రివర్స్ గేర్లా ఉంది

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ పాలన రివర్స్ గేర్లా ఉంది
X

దిశ, తూప్రాన్ : కాంగ్రెస్ అంటేనే అబద్దాల పార్టీ అని, వారి పాలన రివర్స్ గేర్లా ఉంది అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున తూప్రాన్ లో రోడ్ షో లో పాల్గొని కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నోరు తెలిస్తే సిగ్గులేకుండా దొంగమాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళలకు 2500 ఇస్తున్నాం అని అంటున్నారని, నిద్రలో మాట్లాడుతున్నారా అని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి కరెంట్ కోతలు,నీళ్ల సమస్యలు మొదలయ్యాయని అన్నారు. దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని అన్నారు. కేసీఆర్ వదిలిన బాణం మన వెంకట్రామిరెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తి ని గెలిపించి పార్లమెంట్ కు పంపితే ఉపయోగం ఉంటదన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డిసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, బాబుల్ రెడ్డి, రవీందర్ గౌడ్, సతీష్ చారి, కౌన్సిలర్ లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed