కాంగ్రెస్ పార్టీదీ... 420 మెనిఫెస్టో : Thaneeru Harish Rao

by Naresh N |
కాంగ్రెస్ పార్టీదీ... 420 మెనిఫెస్టో : Thaneeru Harish Rao
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో 420 మెనిఫెస్టో అని మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పథకాలను, మెనిఫెస్టోను కాఫీ కొట్టారని, కొన్ని అచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని కేసీఆర్ చెప్పాడంటే అమలు చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీశ్ రావు హాజరై మాట్లాడారు. ఎలాగూ లెగిచేది లేదని అమలు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని 42 పేజీల మెనిఫెస్టోను రుపొందించారని ఎద్దెవ చేశారు. జనం ఎక్కడ కొడతారో అనే భయంతో కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంట్ ఇస్తామని మెనిఫెస్టోలో పెట్టారన్నారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేరు మార్చి మెనిఫెస్టోలో ప్రకటించారన్నారు.

తెలంగాణలో ప్రకటించిన మెనిఫెస్టోలోని ఆంశాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటకలో కరెంట్ 4 గంటలు వస్తుందని, యువశక్తికి అతిగతి లేదని, 100 రోజుల్లో 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని మాటతప్పరని, మహిళలకు ఉచిత బస్సు పేరిట ఉన్న బస్సులను బంద్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసే పెన్షన్ కు తెలంగాణలో ఇచ్చే పెన్షన్ కు నక్కకు నాగలోకంకు ఉన్న తేడా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పొయిందన్నారు.

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓట్ల కోసం జుటా మాటలు మాట్లాడుతున్నారని, పార్టీ మారగానే మాటమార్చి సెంటిమెంట్ డైలాగులు కొడితే గజ్వేల్ ప్రజలు నమ్మరన్నారు. తిన్నింటి వాసులు లెక్క పెట్టి ధర్మం తప్పంది ఈటల రాజేందరే అన్నారు. రాజకీయ బిక్ష పెట్టి ఎమ్మెల్యే, మంత్రిని చేసిన కేసీఆర్‌కు సున్నం పెట్టె ప్రయత్నం చేశాడన్నారు. కొత్తగా జాతి పేరిట బయలు దేరిన ఈటల కరోనా సమయంలో గజ్వేల్‌లో గరిబోళ్లు గుర్తురాలేదా..ఎన్నడన్న రూపాయి సాయం చేశావా అని ప్రశ్నించారు. గజ్వేల్‌లో ప్రతి పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. రూ. 400 వందల సిలిండర్ ను రూ. 1200లకు పెంచిన ఘనత బీజేపీ దే అన్నారు. గజ్వేల్‌లో ఎలాగు గెలువనని...హుజురాబాద్ కు వెళ్లి నేను ఇక్కడే ఉంటాని చెప్పి వచ్చాడన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన సీఎం కేసీఆర్ ను గెలిపించాలని, మీరే కథనాయకులై గ్రామంలో ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story