- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తప్పుడు అరోపణలు చేస్తే ఊరుకోం..మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకుల ఫైర్...
దిశ,అందోల్: ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నోరును అదుపులో పెట్టుకొవాలని ఖబర్దార్ అంటూ జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జోగిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంలో కాలానుగుణంగా అంచనాలు మారుతుంటాయని, వాటికి అనుగుణంగానే ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందన్న విషయం తెలియకుండా మట్లాడడం క్రాంతి కిరణ్ ఆవివేకానికి నిదర్శమన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ పరిపాలన అనుభవం లేని విధంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం సిగ్గుచేటని, గత బీఆర్‌ఎస్ పాలనలో సర్పంచ్‌లకు బిల్లులను చెల్లించకపోవడంతో ఎందరో అత్మహత్యలు చేసుకున్నా విషయం గుర్తులేదా అంటూ ప్రశ్నించారు.
మున్సిపల్ కౌన్సిలర్‌లు ఆకుల చిట్టిబాబు మాట్లాడుతూ పదేళ్లుగా అస్తవ్యస్తంగా తయారైన రోడ్లను బాగు చేసేందుకు మంత్రి దామోదర్ నిధులను కేటాయించి, పనులకు శ్రీకారం చుడితే ఓర్వలేక పనులను అడ్డుకునేందుకు క్రాంతి కిరణ్ కుట్రలు చేస్తున్నారన్నారు. ఫ్లెక్సీలు కడితే, స్వీటు బాక్సులను ప్రజలకు పంపిణీ చేస్తే అక్రమంగా కేసులు పెట్టించిన చరిత్ర నీదేనన్నారు. మంత్రి బంధువుల కోసమే ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెంచారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం కాదని, చిత్తశుద్ది ఉంటే నిరూపించాలన్నారు. మాజీ ఎంపీటీసీ డి.వెంకటేశం, మాజీ వార్డు మెంబర్ పి.ప్రవీణ్ కుమార్‌లు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అభివృద్ది పనుల విషయంలో 2022లో జీవోలు మంజూరైతే పనులు ఎందుకు చెపట్టలేదో చెప్పాలన్నారు. మీ పాలనలో ఉన్న అధికారులే, ఇప్పుడు ఉన్నారని ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు వేసింది వాళ్లేనన్నారు.
రెండేళ్లకొకసారి 10 నుంచి 12 శాతం రేట్లు పెరుగుతాయని, మీ హయాంలో వేసిన రోడ్ల అంచనాలకు మూడేళ్లు గడిచిందన్నారు. మీ పాలనలో బీటి రోడ్డు ఒక ఇంచు వేయాలని ఉండగా, ప్రస్తుతం మూడు ఇంచుల బీటీ రోడ్డును వేయాలని నిబంధనల మేరకే రెట్లు పెరిగాయన్నారు. అవగాహన లోపంతో మరోసారి మంత్రి దామోదర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్‌గౌడ్, నాగరాజ్ (నాని), దుర్గేష్, చందర్ నాయక్, మాజీ వార్డు సభ్యుడు సీహెచ్. శివకుమార్, నాయకులు డి.శ్రీనివాస్, రాజశేఖర్, నాగయ్య, అనిల్, రాజు, నందు, అబ్బాస్ అలీ, నాగరాజ్, మాణిక్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు.