- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతును రాజును చెయ్యడం కాంగ్రెస్ కే సాధ్యం
దిశ, పటాన్ చెరు : రైతును రాజును చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణలో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు, విపత్తుల నివారణకు హైడ్రా ఏర్పాటు, పటాన్ చెరు వరకు మెట్రో రైల్ నిర్మాణానికి నిధులు కేటాయించిన సందర్భంగా నీలం మధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పూల బోకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు సంక్షేమానికి పాటుపడుతూ రైతును
అప్పుల ఊబి నుంచి బయటపడేస్తూ రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడని కొనియాడారు. ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం చరిత్రలో మొదటి సారన్నారు. రైతు రుణమాఫీతో ఒక ఘట్టం పూర్తయిందని, రానున్న రోజుల్లో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం పనిచేస్తున్న రైతు పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకృతి పరిరక్షణ, విపత్తులను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన 'హైడ్రా' పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. మహానగరంలో కబ్జాలకు గురైన చెరువులు
వరద కాలువలు పునరుద్ధరణతో మహానగరంలో మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. హైడ్రాకు స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రకృతి పరిరక్షణకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు సోపానాలుగా అభిప్రాయపడ్డారు. హైడ్రాతో చెరువులను పునరుద్ధరిస్తే చెరువుల్లో మత్స్య సంపద పెరుగుతుందని వివరించారు. అదే విధంగా పటాన్ చెరు వరకు నిర్మించదలిచిన మెట్రో నిర్మాణానికి బడ్జెట్ లో నిధులు కేటాయించడం పట్ల నీలం మధు ఆనందం వ్యక్తం చేశారు. పటాన్ చెరు వరకు మెట్రో పొడిగింపుతో ఈ ప్రాంతంలో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు. పటాన్ చెరు మెట్రో కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజలమంతా రుణపడి ఉంటామని తెలిపారు. ప్రజలకు మంచి చేస్తూ సుపరిపాలన అందిస్తున్న సీఎం రేవంత్ కు ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు.
- Tags
- Neelam Madhu