- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండపోచమ్మ నుండి కాంగ్రెస్ ప్రచారం ప్రారంభం
దిశ, జగదేవపూర్ : కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో బీఆర్ఏస్ లో వణుకు మొదలైందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ ఆలయంలో నర్సారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిగుల్ నర్సాపూర్, జంగంరెడ్డిపల్లి, వట్టిపల్లి, చాట్లపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో బీఆర్ఏస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను నిర్మించి కమీషన్ లు దండుకున్నారని విమర్శించారు. గజ్వేల్ నుండి కేసీఆర్ ను పారదోలుతేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలు ఇరవై రోజులు కష్టపడితే ఐదేళ్లు కంటికి రెప్పలా కాపడుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జనార్దన్ రెడ్డి, దుర్మార్గం మల్లేశం, న్యాలమడుగు హన్మంతరెడ్డి, పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, సర్పంచ్ లు రజీత రాజేందర్ రెడ్డి, లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, నర్సింహ రెడ్డి తదితరులు ఉన్నారు.