Collector Rahul Raj : డ్రగ్ ఫ్రీ మెదక్‌గా మార్చుదాం

by Aamani |
Collector Rahul Raj : డ్రగ్ ఫ్రీ మెదక్‌గా మార్చుదాం
X

దిశ, మెదక్ ప్రతినిధి : ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని మెదక్ ను డ్రగ్ ఫ్రీ మెదక్ గా మార్చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Collector Rahul Raj ) తెలిపారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్ అబ్యూస్ ఇన్ యూత్ అనే శిక్షణ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ వారు విజయవంతంగా శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. మంగళవారం యాంటీ డ్రగ్ సోల్జర్ పోస్టర్ ను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Collector Rahul Raj) చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం మహమ్మారిగా మారిందని , దీని ద్వారా యువత వారి జీవితాలను, వారి కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డ్రగ్ సమస్యను అరికట్టాలంటే కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే కాకుండా వారితో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని మాఫియాను అరికట్టాలని తెలియజేశారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు, తీసుకున్న వ్యక్తులు, మీ ఏరియాలో తారసపడి నట్లయితే వెంటనే TGANB టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి తెలియజేయాలని, మెదక్ ను డ్రగ్ ఫ్రీ మెదక్ గా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్, కమ్యూనిటీ మొబిలైజషన్ అధికారి సతీష్ కుమార్, రాకేష్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story