- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collector Kranti Valloori: నర్సులే ట్రీట్‌మెంట్ చేస్తే.. డాక్టర్‌లుగా మీరేందుకు..?
దిశ, అందోల్: వైద్యం కోసం ప్రజలు అసుపత్రికి వచ్చిన వారికి నర్సులే ట్రీట్ మెంట్ చేస్తే డాక్టర్‌లుగా మీరేందుకు ఉన్నారని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రతి రోజు డ్రై డే కార్యక్రమంలో భాగంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పర్యటించారు. ఆందోల్ లో పలువార్డుల్లో పర్యటించిన ఆమె పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అక్కడే ఉన్న బస్తీ దవాఖానాను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం జోగిపేట లోని ఏరియా అసుపత్రిలోని వార్డుల్లో పర్యటిస్తూ, వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆమె మాట్లాడారు. వైద్యం కోసం వచ్చిన వారిని డాక్టర్‌లు పట్టించుకొవడం లేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ పట్టణానికి చెందిన ఓ అమ్మాయి కలెక్టర్‌కు విన్నవించగా, ఇదేమి పద్దతి అంటూ అక్కడే ఉన్న అసుపత్రి సూపరిండెంట్ సౌజన్యను ప్రశ్నించగా, నర్సులు చూసుకుంటున్నారని సమాధానం చెప్పడంతో నర్సులే ట్రీట్ మెంట్ చేస్తే డాక్టర్‌లుగా మీరేందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యం కోసం వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని, నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని మె హెచ్చరించారు. ప్రస్తుతం డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తుండడంతో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారికి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. జోగిపేట దవాఖానలో 17 మంది డెంగ్యూ బారిన పడినట్లుగా గుర్తించామని, వారంతా కొలుకుంటున్నారని కలెక్టర్‌కు డాక్టర్ సౌజన్య వివరించారు. డెంగ్యూ వచ్చిన వారికి పూర్తి నయం అయ్యేంతవరకు జాగ్రత్తగా చూసుకొవాలని కలెక్టర్ సూచించారు. అసుపత్రి పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉంచాలని ఆమె ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ తిరుపతి , డిప్యూటీ తహశీల్దార్ మధుకర్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వినయ్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇంటింటికి కమిటీ సభ్యులు..
మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు ముగ్గురితో కలిసి కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు, మెప్మా నుండి రిసోర్స్ పర్సన్ లు, వైద్య ఆరోగ్యశాఖ తరఫు నుండి ఏఎన్‌ఎంలు , ఆశా వర్కర్లు కమిటీ సభ్యులుగా ఉంటారని ఆమె తెలిపారు.ఈ కమిటీ సభ్యులు ఆయా వార్డులలో నిశితంగా పరిశీలించి, పారిశుద్ధ్య సమస్యలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. వార్డులోని ప్రతిఇంటì కి కమిటీ సభ్యులు వేళ్లి, ఇంటి పరిసరాలతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటారన్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహనను కల్పిస్తారన్నారు. ప్రజలు కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తో పాటు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకొవాలన్నారు. ఎవరైనా జ్వరాల బారిన పడితే వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించే చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.