- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ది పైశాచిక ఆనందం.. మంత్రి హరీష్ రావు
దిశ బ్యూరో, సంగారెడ్డి/ పటాన్ చెరు : తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని, వారిదో పైశాచిక అనందం పొందుతున్నారని ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో 22న బుధవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇండ్లు, పటాన్ చెరు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పటాన్ చెరులో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సూపర్ స్పెషల్టీ ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని, నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ పరిశ్రమను కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు.
రూ. 183 కోట్లతో పటాన్ చెరులో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చెప్పారు. ఇప్పటికే సంగారెడ్డికి వైద్య కళాశాల ఇచ్చి దశాబ్దాల కోరికను నెరవేర్చామని, కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న ప్రసవాల శాతం ఇప్పుడు 81శాతానికి పెరిగిందన్నారు. పటాన్ చెరుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడంతో ఈ ప్రాంతానితో ఎంతో ప్రయోజనం చేకూరనున్నదన్నారు. వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో పరిమిత సంఖ్యలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందన్నారు. 21 రోజుల పాటు జరిగిన దశాబ్ది ఉత్సవాలను ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయడం పై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అమరులను
కాంగ్రెస్ అవమానిస్తోంది...
దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ దగా కార్యక్రమంగా నిర్వహించి అమరులను అవమనిస్తోందని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది పైశాచిక ఆనందం అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు సంతోషంగా ఉంటే జీర్ణించుకోలేక పోతోన్నది, అభివృద్ధి చరిత్ర బీఆర్ఎస్ ది, అవరోధాల చరిత్ర కాంగ్రెస్ ది అని మంత్రి నిప్పులు చెరిగారు. రాజీనామాల చరిత్ర బీఆర్ఎస్ ది, రాజీల చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు. తెలంగాణ ఆచరిస్తది, దేశం అనుసరిస్తది అన్నట్లుగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మార్చారని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలన అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లుగా ఉండేదని మంత్రి గతాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాడు తుపాకీ పట్టుకుని ఉద్యమ నాయకుల మీదకు వెళ్లలేదా..? అని గుర్త చేశారు.
తెలంగాణ వచ్చినరోజు 17వేలుగా ఉన్న వైద్య విద్య సీట్లను నేడు 50 వేలకు పెంచామని, కాంగ్రెస్ పార్టీ హయాంలో 20 ఏండ్లలో ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తే, తాము ఒక ఏడాదిలో 9 కాలేజీలు తీసుకొచ్చామన్నారు. పెళ్లి మంత్రం చదవమంటే, చావు మంత్రం చదివినట్లుగా కాంగ్రెస్ తీరు ఉన్నదని విమర్శంచింారు. ఉద్యమకారులను చిన్న బరిచే విధంగా కాంగ్రెస్ తీరు ఉన్నది, కాంగ్రెస్ ప్రజలకు దూరం అవుతోందని,ఆ పార్టీకి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, కార్పోరేషన్ లు చైర్మన్ చింతా ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ శరత్, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్,మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.