- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ
దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి అమృతాభిషేకంనర్సాపూర్ పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి అమృతాభిషేకం చేసి కేక్ కట్ చేసే సమయంలో తలెత్తిన వివాదంలో టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అమృత అభిషేకం చేస్తున్న క్రమంలో నాయకులు ఫోటో దిగే సమయంలో తోపులాట జరిగింది. ఇదే విషయంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్ మాజీ ఎంపీటీసీ భర్త సర్వేశ్ ల మధ్య వాగ్వివాదం తీవ్రస్థాయిలో చోటుచేసుకుంది.
పట్టణ అధ్యక్షుడు బిక్షపతి కల్పించుకొని ఇద్దరినీ సమన్వయం చేసినప్పటికీ గొడవ సద్దుమనగకపోవడంతో మిగతా టీఆర్ఎస్ నాయకులంతా వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగా మండల పరిధిలోని మూసాపేట్ గ్రామ సర్పంచ్ రవి మాట్లాడుతూ.. కేసీఆర్ జన్మదిన వేడుక వేడుకల కోసం తమను పిలిపించి జన్మదిన వేడుకల్లో ఫోటో కూడా దిగేందుకు తమరికి అవకాశం ఇవ్వకుండా మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులను ఎందుకు పిలిపించార అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గత ఏడాది సైతం ఫ్లెక్సీలో కొంత మంది ఫోటోలు పెట్టకుండా అవమానపరిచారు అంటూ టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్న విషయం ప్రస్తుతం చర్చించుకున్నారు. అయితే కేసీఆర్ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు వాగ్వివాదం జరిగిన ఘటన నర్సాపూర్ పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.