- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మిక రంగానికి పెనుముప్పుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
దిశ పటాన్ చెరు : దేశంలో 80 శాతం ఉన్న కార్మిక లోకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెనుముప్పుగా మారుతున్నాయని, భవిష్యత్తులో కార్మికులకు తగిన న్యాయం జరగాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీనీ దేశవ్యాప్తంగా ఆదరించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో నియోజకవర్గ మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడే జెండాను ఎగురవేసి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పారిశ్రామిక రంగంలో చేపడుతున్న విప్లవత్మక సంస్కరణల మూలంగా పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలోనూ కార్మికులకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులకు సైతం మెరుగైన జీతాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, బీ ఆర్ టీ యూ సంఘం జిల్లా అధ్యక్షులు శివశంకర్, రాష్ట్ర నాయకులు వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, పరమేష్ యాదవ్, పృథ్వీరాజ్, అఫ్జల్, వివిధ పరిశ్రమల కార్మిక సంఘాల నాయకులు, ఆటో డ్రైవర్లు, హోటల్ వర్కర్స్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.