stolen : కారు అద్దాలు పగలగొట్టి... రూ.10 లక్షల నగదు చోరీ..

by Kalyani |
stolen : కారు అద్దాలు పగలగొట్టి... రూ.10 లక్షల నగదు చోరీ..
X

దిశ, ఆందోల్: జోగిపేటలో పట్టపగలే దొంగల హల్ చల్ చేశారు. పోలీస్ స్టేషన్ ప్రధాన గేటు ముందున్న జాతీయ రహదారిపై కారు అద్దాలు పగలగొట్టి పది లక్షలు నగదు అపహరించుకుని పోయిన సంఘటన సంచలనం రేపింది. జోగిపేట కు చెందిన రిటైర్డ్ ట్రాన్స్ కో ఏడిఏ రవీందర్ రెడ్డి సోమవారం ఆయన కుమారుడు సాయి కిరణ్ రెడ్డి ఎస్బిహెచ్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.10 లక్షల చెక్కును డ్రా చేసుకొని కారులో పెట్టుకున్నాడు. టీఎస్15 ఈడబ్ల్యూ 2168 నెంబర్ గల కారులో నగదును ముందు సీట్లో పెట్టుకొని పోలీస్ స్టేషన్ ముందు స్వీటు తీసుకునేందుకు రోడ్డు పక్కన కారును పార్క్ చేసి స్వీటు కొనేందుకు దుకాణానికి వెళ్లారు.

ఇంతలోనే గుర్తుతెలియని దొంగలు ఇది గమనించి కారు అద్దం పగలగొట్టి కారులో ఉన్న పది లక్షల నగదును ఎత్తుకెళ్లారు. కారు దగ్గరకు వచ్చి డోర్ తీసి చూడక, కారు అద్దాలు పగలగొట్టి ఉండడం, డబ్బులు కనిపించకపోవడంతో రవీందర్ రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి బ్యాంకుకు చేరుకొని బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. పోలీస్ స్టేషన్ ముందే పట్టపగలు భారీ నగదు అపహరణకు గురికావడం, ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది.

Advertisement

Next Story