- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షం : ఎమ్మెల్యే క్రాంతికిరణ్
దిశ, రేగోడ్ : బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలిచే ప్రభుత్వమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రేగోడ్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నరసింహ ఈ నియోజకవర్గానికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.
మోడల్ స్కూల్, జేఎన్టీయూ ఆయన ప్రత్యేకంగా సాధించి తెచ్చిందేమి లేదని ఆరోపించారు. ఆయనకు ఉన్న అహంకారం గురించి అందరికీ తెలుసని, కాంగ్రెస్ వాళ్లే నాకు ఫోన్ చేసి ఆయన గురించి కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా చెబుతున్నారని తెలపారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని మెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. తెలంగాణలో కూడా గెలుస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారని, అక్కడ మబ్బులు పడితే ఇక్కడ వర్షం పడుతుందా అని ప్రశ్నించారు.
తాను అందోల్ నియోజకవర్గంలోనే ఉండి స్థానికం అన్న పదానికి సార్థకత తీసుకొచ్చానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు రమేష్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.