- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నను చంపిన తమ్ముడి అరెస్ట్.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
దిశ, హుస్నాబాద్ ; భూమి తగాదా విషయంలో సొంత అన్ననే కడతేర్చిన తమ్ముడు పారిపోగా పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసిన ఘటన హుస్నాబాద్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. హుస్నాబాద్ సిఐ కొండ్రు శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం ... నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం మసిరెడ్డి తండాకి చెందిన గుగులోతు రాజు, గుగులోతు భీమా ఇద్దరు అన్నదమ్ములు. కొంతకాలం నుండి ఇరువురి మధ్య భూమి ఆస్తి తగాదా విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో గుగులోతు బీమా అతని కొడుకు అనిల్ హైదరాబాదు నుండి బైక్ పై ఈనెల 12న మసిరెడ్డి తండాకు వచ్చారు. ముందు వేసుకున్న పథకం ప్రకారం గుగులోతు లలిత, భీమా, అనిల్ ముగ్గురు కలిసి రాజును కర్రలతో మరియు పైపుతో కొట్టి చంపి పారిపోయారు. అయితే అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో వారిపై హత్య యత్నం కేసు నమోదు చేసి పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. కాగా కేసు పరిశోధనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గం.ల సమయంలో హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ అక్కన్నపేట ఎస్సై విజయభాస్కర్ సిబ్బందితో కలిసి జనగామ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేయుచుండగా బైక్ పై వచ్చిన గుగులోతు బీమా ను అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని పట్టుకొని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని దీంతో నేరానికి ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.