- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెరుగైన వైద్యం అందించాలి.. కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు..!
దిశ, తూప్రాన్ః ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ జిల్లా తూప్రాన్ లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(C.H.C) జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటి, బ్లడ్ బ్యాంక్, ప్రసూతి వార్డు, లేబర్ రూమ్, ప్లేట్ లెట్ మిషన్, ఐసీయు, జనరల్ వార్డులను పరిశీలించి వైద్య సేవలకు వచ్చిన పలువురితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో ఉండాలని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో 46 వ్యాధిగ్రస్తులను పరిశీలించగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఏ ఒక్కరికీ లేవని 10 టైఫాయిడ్ కేసులు మాత్రమే ఉన్నాయని వివరించారు. విష సర్పాల కాటుకు, కుక్క కాటుకు కావలసిన వాక్సిన్లు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అమర్ సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.