అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Shiva |
అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, మనోహరాబాద్: ఆకలితో అలమటించి, అనారోగ్యానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని కాళ్లకల్ బస్టాప్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. దాదాపు 55 ఏళ్ల వయసు గల వ్యక్తి అనారోగ్యానికి గురై, సరైన భోజనము లేక ఆకలితో అలమటిస్తూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు గుర్తించామన్నారు. సోమవారం ఉదయం గ్రామ కార్యదర్శి శంకర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంచనామ నిర్వహించి మృతదేహాన్ని తూప్రాన్ మార్చురీకి తరలించమని ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed