వాళ్లంతా నాన్ లోకల్ మాణిక్య రావు ఒక్కడే లోకల్ : మంత్రి

by Naresh N |
వాళ్లంతా నాన్ లోకల్ మాణిక్య రావు ఒక్కడే లోకల్ : మంత్రి
X

దిశ , జహీరాబాద్: వికారాబాద్, పెద్దపల్లిలో పని చేయని వ్యక్తి ఇక్కడ పని చేస్తాడా? అంటూ మంత్రి హరీశ్ రావు మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ పై కామెంట్స్ చేశాడు. జహీరాబాద్ లో నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కె.మాణిక్ రావు విజయానికి అవసరమగు సూచనలు, సలహాలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళంతా నాన్ లోకల్ అయితే మాణిక్య రావు ఒక్కడే లోకల్. ఎన్నికల్లో గెలిచేది మాణిక్య రావు, మీకు సేవ చేసేది మాణిక్య రావేనని స్పష్టం చేశారు. జహీరాబాద్ ఆత్మగౌరవం గెలవాలంటే బీఆర్ఎస్ గెలవాలని, అందుకు నా బలం కూడా తోడు చేసి మీకు సేవ చేస్తామన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాదని, అన్ని రకాలుగా తోడ్పాటు నందిస్తానని , కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడతానన్నారు.

ఏ సర్వేలు చూసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అంటున్నాయని , ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకొని కేసీఆర్ కు బహుమతిద్దామన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు తెస్తామని, రెండేళ్లలో సాగునీరు తెచ్చి కరువు అనేది జహీరాబాద్ డిక్షనరీలో లేకుండా చేస్తామన్నారు.

డీకే కాంగ్రెస్ కు బొంద పెట్టి పోయాడు

కర్ణాటక నుంచి డీకె.శివకుమార్ వచ్చి 5 గంటల కరెంట్ మాత్రమే కర్ణాటకలో ఇస్తున్నామని ఒప్పుకుని నగ్న సత్యాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పాడని, ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టి పోయిండని మంత్రి హరీష్ రావు చెప్పారు. బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నోరు విప్పితే భూతులని , ఓయూ విద్యార్థులను అడ్డ కూలీలంటూ అవమానపరిచారన్నారు. కేసీఆర్ రైతు బంధు ఇస్తే, రైతులను బిచ్చగాళ్లన్నడని ఆరోపించారు. తెలంగాణ గెలవాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని , ఓడాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రైతుకి రూ.15 వేలు అంటే, బీఆర్ఎస్ ఒక్కో ఎకరాకు రూ.16 వేలు అంటున్నదని ప్రజలు ఆలోచించాలన్నారు.

బీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీని మతం, కులం తేడా లేకుండా అభివృద్ధి చేస్తూ పాలన కొనసాగించిందన్నారు. కర్ఫ్యూ లేదు, గడబిడ లేదు, గంగా జమున తెహాజీబ్ లాగా కలిసి ఉన్నామన్నారు. ఎబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ ఉందని , బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు కదా ఎవరు వచ్చినా హ్యాట్రిక్ కొట్టేది ముమ్మాటికీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. జహీరాబాద్ లో ఎగురువేసేది గులాబీ జెండే నని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ. బీబీ బాటిల్, ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ ఎండీ.తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై.నరోత్తం, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ ఇతర నాయకులు, సభ్యులు తదితరులున్నారు.

Advertisement

Next Story