బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. మల్లికార్జున్ ఖర్గే

by Sumithra |
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. మల్లికార్జున్ ఖర్గే
X

దిశ, మెదక్ ప్రతినిధి : రాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీలు ఒక్కటేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యాత్ర అనంతరం స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ తో కలిసి మాట్లాడుతు.. కర్ణాటకలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను తెలంగాణలో కూడా పక్కా అమలు చేస్తామని చెప్పారు. మహా లక్ష్మి పథకం ద్వారా గృహిణులకు నెలకు 2500, ధాన్యం పండించే రైతులు ఎకరాకు ఏడాదికి 15,000, కౌలు రైతులకు ప్రతియేట 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే దిట్టుబాటు ధరతో పాటు ధాన్యం పై ప్రతి క్వింటాల్ కు 500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు. 200 యూనిట్ ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. మెదక్ జిల్లా ప్రపంచ వ్యాపారంగా గుర్తింపు ఉందన్నారు. ఇక్కడి నుంచి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ బారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్సు కర్మాగారాలు ఏర్పాటు చేసిందని, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ వాటిని ప్రైవేట్ కు విక్రయించే కుట్ర చేస్తుందని ఆరోపించారు.

బీజేపీకి రాష్ట్రంలో ఉన్న అధికార బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని, బయట వేరువేరుగా ఉన్న నాణేనికి రెండు వైపులా మాదిరిగా పార్టీలు కాలిపోయాయి అని అన్నారు. కాంగ్రెస్ వల్లే కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎం అయ్యాడని అన్నారు. కానీ రాష్ట్రం అభివృద్ది చేదాలని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఆశించిన అభివృద్ధి రాష్ట్రంలో లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చేశారనీ ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల పై భారం మోపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మోడీ, షా, కేసీఆర్ లకు భయపడేది లేదని, అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు, కాంగ్రెస్ నేతలు రాజీ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుహాసిని రెడ్డీ, సుప్రభాత్ రావు, ప్రశాంత్, అనిల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed