- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మనస్తాపంతో యువకుడి అత్మహత్య
దిశ, అందోల్ : తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడిన ఘటన జోగిపేట పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సామ్యా నాయక్ కథనం ప్రకారం.. జోగిపేట పట్టణానికి చెందిన కే.శ్రీనివాస్ (35) అనే యువకుడు పట్టణానికే చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లిన శ్రీనివాస్, సదరు మహిళ మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శ్రీనివాస్ పక్క గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 8 గంటల వరకు శ్రీనివాస్ గది నుంచి బయటకు రాకపోవడంతో, లోపల డోర్ గడియ పెట్టి ఉండడంతో సదరు మహిళ ఇరుగు పోరుగు వారిని పిలిపించి, డోర్ ను పగలగొట్టి చూడగా శ్రీనివాస్ ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సామ్యానాయక్ వివరాలను సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సామ్యా నాయక్ తెలిపారు.